బెంగళూర్ : ఉద్యోగం ఆశచూపి కారులో మహిళ(25)పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్నాటక రాజధాని బెంగళూర్లో వెలుగుచూసింది. నిందితుడిని హర్ష గౌడ (26)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని మదనాయకనహళ్లికి చెందిన మహిళకు అదే ప్రాంతానికి చెందిన నిందితుడితో పరిచయం ఉంది.
జనవరి 16న నిందితుడు గౌడ బాధితురాలికి ఫోన్ చేసి ఉద్యోగం గురించి మాట్లాడాలని పిలిపించాడు. అతడి ఉద్దేశాలు తెలియని మహిళ తుమకూరు రోడ్డులో గౌడను కలిసేందుకు అంగీకరించింది. ఆపై అక్కడికి వచ్చిన మహిళను పార్క్ చేసిన తన వాహనంలో కూర్చుని మాట్లాడదామని పిలిచాడు.
జాబ్ ఇప్పిస్తానంటూ కారులోపల లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.