ఐఐటీ మద్రాస్ క్యాంపస్ విద్యార్ధినిపై లైంగిక వేధింపులు-క్యాంటిన్ వర్కర్ అరెస్ట్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-ఎం) కాలేజ్ క్యాంటిన్లో పనిచేసే కార్మికుడిని క్యాంపస్‌లో సెకండియర్ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-ఎం) కాలేజ్ క్యాంటిన్లో పనిచేసే కార్మికుడిని క్యాంపస్‌లో సెకండియర్ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఐటీ-ఎంలో న్యూ అకడమిక్ కాంప్లెక్స్ (ఎన్ఏసీ) సమీపంలో జులై 24న లైంగిక వేధింపుల ఘటన జరిగింది.
విద్యార్ధిని సైకిల్‌పై తన హాస్టల్‌కు తిరిగివస్తుండగా క్యాంటిన్ వర్కర్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. రెండు రోజుల తర్వాత బాధితురాలి స్నేహితురాలు ద్వారా మేనేజ్మెంట్ దృష్టికి వెళ్లింది.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన మీదట క్యాంటిన్ వర్కర్ వేధింపులకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగస్ట్ 2న అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బిహార్‌లోని నవాదా జిల్లాకు చెందిన చందన్ కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

