Telangana Student Suicide | ఖరగ్పూర్ ఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య.. !
Telangana Student Suicide | ఐఐటీ-ఖరగ్ పూర్ లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి, తెలంగాణలోని తూఫ్రాన్ కు చెందిన కిరణ్ చంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Telangana Student Suicide | ఐఐటీ-ఖరగ్పూర్లో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో మరణించాడు. అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరణించిన విద్యార్థి.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తున్న కే కిరణ్ చంద్ర (21) తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా తుఫ్రాన్ వాసి అని భావిస్తున్నారు.
కిరణ్ చంద్ర మరణించిన సంగతి ఆయన హాస్టల్ సహచర విద్యార్థులు తమకు సమాచారం ఇచ్చారని ఐఐటీ-ఖరగ్ పూర్ వర్గాలు తెలిపాయి. వెంటనే చికిత్స కోసం క్యాంపస్ లోని దవాఖానకు తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు.
కిరణ్ చంద్ర మరణంపై కేసు నమోదు చేసుకుని, పోస్ట్ మార్టం కోసం మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ కం దవాఖానకు తరలించామని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. కిరణ్ చంద్ర ఆత్మహత్యకు పాల్పడటంతో ఐఐటీ-ఖరగ్పూర్ విద్యార్థులు, స్టాఫ్, ఫ్యాకల్టీ దిగ్భ్రాంతికి గురయ్యారు. కిరణ్ చంద్ర మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నట్లు ఐఐటీ ఖరగ్ పూర్ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

