Fire Accident | ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం
Fire Accident | హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. మంగళవారం రాత్రి గల బట్టల దుకాణం ‘సీఎంఆర్ షాపింగ్ మాల్’లో మంటలు చెలరేగాయి.
Fire Accident | హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. మంగళవారం రాత్రి గల బట్టల దుకాణం ‘సీఎంఆర్ షాపింగ్ మాల్’లో మంటలు చెలరేగాయి. ఈ సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక దళ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. బట్టల దుకాణం కావడంతో మంటలు ఎగసి పడుతున్నాయి. మంటల తీవ్రతకు చుట్టుపక్కల దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇండ్లు, అపార్ట్ మెంట్ల వాసులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తున్నది. మంటల తీవ్రతతో అగ్ని మాపక దళ సిబ్బంది.. షాపింగ్ మాల్ వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
షాప్ మూసివేసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగినందున లోపల సిబ్బంది ఉన్నారా.. లేదా తెలియడం లేదు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా.. ఫైర్ సేఫ్టీ రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా తెలియడం లేదు. మంటలు ఆర్పిన తర్వాత గానీ పూర్తి వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.మంటలు ఎగసి పడటంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు స్థానిక వాటర్ ట్యాంకర్లను రప్పించి మంటలను ఆర్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఫైరింజన్లన్నీ అక్కడికి తెలుస్తున్నది.
మంటలు ఎగసి పడటంతో వాటిని ఆర్పివేయడం కష్టంగా కనిపిస్తున్నది. సకాలంలో అగ్ని మాపక దళాలు వచ్చినా మంటలు ఆపలేకపోతున్నారు. షాపింగ్ మాల్ మూసివేసే సమయంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. ఈ సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు, సివిల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

