గువహటి : అసోంలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును గువహటి పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు రూ 7.5 కోట్ల విలువైన 750 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గువహటిలోని గర్చుక్ ప్రాంతంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపి దాడులు తీవ్రతరం చేశామని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో మణిపూర్‌కు చెందిన డ్రగ్స్ సరఫరాదారును అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుల్లో 260 గ్రాముల హెరాయిన్‌ను తరలిస్తూ నిందితుడు పట్టుబడ్డాడు. మణిపూర్ నుంచి వస్తున్న బస్‌ను ఆపి పోలీసులు తనిఖీ చేయడంతో డ్రగ్స్ దందా బట్టబయలైంది. అసోంలోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.