లక్నో: స్కూల్కు వెళ్తున్న బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలిక బుధవారం ఉదయం స్కూల్కు వెళ్తున్నది. 20 ఏళ్ల వ్యక్తి ఆమెను కలిసి మాయ మాటలు చెప్పాడు. సెక్టార్ 32లోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అనంతరం పోలీస్ స్టేషన్కు వ్యాన్లో తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చుట్టుముట్టిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై రాళ్ల దాడి చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు గన్తో కాల్పులు జరుపగా నిందితుడు గాయపడ్డాడు. అతడ్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లైంగిక దాడి, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.