చెట్టును ఢీకొట్టిన ట్రాలీ ఆటో : నలుగురు మహిళా కూలీలు దుర్మరణం
చెట్టును ఢీకొట్టిన ట్రాలీ ఆటో | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో (పికప్ వాహనం) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో (పికప్ వాహనం) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. రాజానందగావ్ జిల్లా అర్జునీగ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు పనులు ముగించుకొని స్వగ్రామం రైతాపల్లికి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని డోంగార్గావ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజానందగావ్ మెడికల్ కళాశాల దవాఖానకు పంపారు. అతివేగం కారణంగా డ్రైవర్ వాహనంపై పూర్తిగా నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బాధిత కుటుంబీలకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

