Fake Currency | మహారాష్ట్రలో భారీగా నకిలీ రూ.2 వేల నోట్లు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
Fake Currency | నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే రూ.2000 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Fake Currency | మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో నకిలీ రూ.2 వేల నోట్లు దొరికాయి. వీటి విలువ దాదాపు రూ.8 కోట్ల వరకు ఉండనున్నది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వీరి వెనకున్న ముఠా మూలాలను లాగే పనిలో నిమగ్నమయ్యారు.
నకిలీ కరెన్సీ ప్రింటింగ్ ముఠా గుట్టును థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి భారీగా రూ. 2000 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రూ.8 కోట్ల విలువైన రూ.2000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగున్న సమయంలో.. అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ నోట్లను స్వాధీనపర్చుకున్నారు. ఈ కేసులో పాల్ఘర్కు చెందిన రామ్ శర్మ, రాజేంద్ర రౌత్‌లను థానే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నకిలీ నోట్లను ముద్రించిన ముఠా నుంచి నకిలీ రూ.2000 నోట్లున్న 400 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ ప్రింటర్ల నెట్వర్క్ ఎంత వరకు విస్తరించి ఉన్నదనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మార్కెట్లో రూ.2000 నోట్ల కొరత ఉండడంతో మోసగాళ్లు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నకిలీ నోట్లను మార్కెట్‌కు తరలించే పనిలో ఉండగా పట్టుబడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని, లేదంటే పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చి సామాన్య ప్రజానీకం ఇబ్బందులపాలయ్యేదని పోలీసులు అంటున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

