కూకట్పల్లి : కూకట్పల్లి ( Kukatpally ) పరిధిలోని కైతలాపూర్ డంపింగ్ యార్డ్ ( Dumping Yard ) చెత్త కుప్పలో 45-50 వయసు కలిగిన గుర్తు తెలియని మృతదేహం కుళ్లిపోయిన ( Decomposed Body) స్థితిలో లభ్యమైంది. నరసింహా అనే వ్యక్తి డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో కూకట్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.