5జీ అప్‌గ్రేడ్ పేరిట సైబర్ మోసాలు..! జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచన
Cyber scams | సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కేటగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కేటగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, డిబిట్ కార్డు అప్‌గ్రేడ్ చేసుకోవాలని.. లారీ వచ్చిందంటూ నమ్మ బలికి అకౌంట్లలో ఉన్న సొత్తు లూటీ చేసిన సంఘటనలున్నాయి.
తాజాగా దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు దిగారు. 5జీ సర్వీస్ అప్గ్రేట్ పేరుతో కేటగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలంటూ పలువురికి ఫోన్లు చేస్తూ.. ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 5జీ అప్‌గ్రేడ్ పేరిట ఎవరైనా ఫోన్లు చేస్తే.. నమ్మొద్దని, ఓటీపీలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని, తప్పనిసరిగా టెలీకాం స్టోర్స్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

