విషాదం.. కరోనా భయంతో కుటుంబం ఆత్మహత్య
కరోనా భయంతో కుటుంబం ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అమరావతి : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతున్నది. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకినా కుటుంబ సభ్యులంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు సైతం వెనుకాడకపోవడం ఆందోళన రెకెత్తిస్తున్నది.
తాజాగా కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నల్లబెల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లిదండ్రులతోపాటు కుమారుడు, కోడలుకు నాలుగురోజుల క్రితం కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

