ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య
Suicide: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

జైపూర్: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మనీష్ సింధి (40)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం పనిమనిషి వెళ్లేసరికి మనీష్ సింధి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఆమె తలుపులు ఎంత తట్టినా తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచింది.
దాంతో ఇరుగుపొరుగు వచ్చి కూడా తలుపులు తట్టారు. అయినా తీయకపోవడంతో కిటీకిలు తెరిచి చూసి షాకయ్యారు. లోపల మనీష్ సింధి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుజరాత్లో ఓ ఫంక్షన్‌కు వెళ్లిన అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. అయితే, మనీష్ సింధి ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

