ఆడపిల్లకు జన్మనిచ్చిన అత్యాచార బాధితురాలు.. బిడ్డను వదిలించజూసిన 13 మందిపై కేసులు
Baby girl: అత్యాచార బాధితురాలికి జన్మించిన ఆడబిడ్డను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసే ప్రయత్నం చేసిన 13 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు.

ముంబై: అత్యాచార బాధితురాలికి జన్మించిన ఆడబిడ్డను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసే ప్రయత్నం చేసిన 13 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల క్రితం ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడటంతో సతారా జిల్లాకు చెందిన ఓ 15 ఏండ్ల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బాలిక కుటుంబసభ్యులకు తెలియడంతో అబార్షన్ చేయించాలని చూశారు. కానీ అప్పటికే అబార్షన్ చేయాల్సిన సమయం దాటిపోవడంతో బాధ్యులెవరని బాలికను నిలదీశారు.
దాంతో తనపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకుల పేర్లను బాలిక వెల్లడించింది. దాంతో కుటుంబసభ్యులు ఆ ఇద్దరు యువకులకు విషయం తెలియజేసి పంచాయితీ పెట్టారు. ఈ సందర్భంగా నిందితులిద్దరూ.. బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎక్కడైనా వదిలేసే బాధ్యత తమదని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. నిందితులు బాధితురాలి బిడ్డను ముంబైకి చెందిన దంపతులకు ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే, ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలికపై అత్యాచారానికి పాల్పడటమేగాక, ఆమె కన్నబిడ్డను చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేసిన నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో 11 మందిపై కేసులు నమోదుచేశారు. వారిలో అత్యాచార బాధితురాలి కుటుంబానికి చెందిన ఒక సభ్యుడు కూడా ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
Aarogyasri | ఏడాదిగా జీతాల్లేవ్.. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
Mining Mafia | మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

