Brothers clash: మద్యం మత్తులో సోదరుల ఘర్షణ.. అన్నను చంపిన తమ్ముడు
Brothers clash: మద్యం మత్తులో అన్నదమ్ములు ఘర్షణ పడిన ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. డబ్బు కోసం ఇద్దరి మధ్య తలెత్తిన గొడవతో...

(Brothers clash) హైదరాబాద్: మద్యం మత్తులో అన్నదమ్ములు ఘర్షణ పడిన ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. డబ్బు కోసం ఇద్దరి మధ్య తలెత్తిన గొడవతో ఆగ్రహానికి గురైన తమ్ముడు అన్నను ప్రెషర్ కుక్కర్‌తో కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్‌లో జరిగింది.
వైజాగ్‌కు వెంకట శ్రీమన్నారాయణ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇటీవల శ్రీమన్నారాయణ మృతిచెందడంతో అతడి భార్య వరలక్ష్మి,తన ఇద్దరు కొడుకులు మారుతి భరత్ భూషణ్ (35), సాయి తేజ (28) లతో కలిసి చర్చి గాగిల్లాపూర్‌లో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. తల్లి పక్షవాతంతో బాధపడుతుండగా.. ఇద్దరు కొడుకులు జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసగా మారారు. అన్నదమ్ములు తరచూ తాగిన మైకంలో డబ్బు కోసం గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 24 న రాత్రి మరోసారి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు సాయి తేజ అన్న మారుతి భారత భూషణ్‌పై కుక్కర్‌తో దాడి చేశాడు. దాంతో భరత్ భూషణ్ అక్కడికక్కడే మరణించాడు. భయపడిపోయిన సాయి తేజ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో.. ఆ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు.. శనివారం రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సాయి తేజ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్నదమ్ముల మధ్య కత్తులతో దాడులు.. అన్న కుమారుడి తలకు తీవ్రగాయం!
Guptha Padmasana | గుప్త పద్మాసనం అంటే ఏమిటి.. ఎలా వేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
IND vs PAK | దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన పాక్!
Bilal Kazi: 70 మంది అమ్మాయిలకు వేధింపులు.. బ్రిటన్‌లో భారతీయుడికి 30 ఏళ్ల జైలుశిక్ష
Dhanush | ధనుష్ ‘ఓఎం’ ట్రైలర్లో ‘ధురంధర్’, ‘అవతార్’ ఛాయలు.. కథపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

