Crime News | రోడ్డు దాటించాలని అడిగిన అంధ యువతి.. చీకటి సందులోకి తీసుకెళ్లి దారుణం!
దేవుడు అప్పటికే ఆమెకు అన్యాయం చేశాడు. చిన్న వయసులోనే కళ్లు లాగేసుకున్నాడు. అయినా జీవితంతో పోరాడుతూ జీవనం సాగిస్తోందా 20 ఏళ్ల యువతి. ఆమెపై ఒక నీచుడు దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వార్కా ప్రాంతంలో వెలుగు చూసింది. సదరు యువతి రోడ్డుపై నిలబడి ఎవరైనా రోడ్డు దాటించాలని అడిగింది. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతలో అటుగా వచ్చాడో కామాంధుడు. రోడ్డు దాటిస్తానని చెప్పి ఒక చీకటి సందులోకి తీసుకెళ్లి ఆమెను బలాత్కరించాడు.
ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సందులో నుంచి ఎలాగోలా బయటకు వచ్చిన ఆమె.. ఆటో ఎక్కి ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియగానే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. డిజిటిల్ టెక్నాలజీ సహకారంతో నిందితుడిని చేతన్ ఖన్నా అనే యువకుడిగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాధితురాలిని సంప్రదించి ఆమెకు అన్నిరకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- blind
- Crime news
- Delhi
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

