తార్నాకలో ఘోర రోడ్డుప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న బెంజ్ కారు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని తార్నాక సీసీఎంబీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
బాధిత వ్యక్తి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడిని సోహన్ గౌడ్‌గా, క్షతగాత్రుడిని రితేశ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. బెంజ్ కారు పూర్తిగా దెబ్బతిన్నది. అయితే వీరు గమ్యస్థానానికి కిలోమీటర్ దూరంలో ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

