తండ్రి అక్రమ సంబంధాన్ని నిలదీసిన 10 ఏళ్ల కుమారుడు.. ఆ తర్వాత ఏమైందంటే..
Bengaluru | తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు

బెంగళూరు : తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు అదృశ్యమయ్యాడని నాటకామాడాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బట్టబయలైంది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరులోని గురప్పనపాల్యకు చెందిన సునీల్ కుమార్ (30) కు స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహమైంది. ఈ దంపతులకు 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సునీల్ కుమార్ ప్రయివేటు ఉద్యోగి కాగా, ఆయన భార్య ఓ గార్మెంట్ షాపులో పని చేస్తోంది. ఆవిడతో పాటు పని చేసే మరో మహిళతో సునీల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెను వదిలిపెట్టాలని పలుమార్లు సునీల్‌కు తన భార్య చెప్పింది. అయినప్పటికీ వినిపించుకోలేదు. అయితే ఆగస్టు చివరి వారంలో ప్రియురాలితో సరసాలాడుతున్న తండ్రిని పట్టుకుని కుమారుడు నిలదీశాడు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించాడు. భార్య కూడా వారి సంబంధాన్ని తిరస్కరిస్తోంది. ఇప్పుడు కుమారుడు కూడా నిలదీయడంతో.. కోపగించుకున్న తండ్రి అతన్ని చంపేశాడు. భార్య ఇంటికొచ్చేసరికి కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆమె బోరున విలపించింది.
ప్రియురాలిని వదిలేస్తా.. భార్యను ప్రాధేయపడిన భర్త
రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తల్లి బోరున విలపించింది. ఈ క్రమంలో భర్త ఆమె వద్దకు వచ్చి ప్రియురాలిని వదిలేస్తాను. బాలుడి మృతదేహాన్ని ఖననం చేసేందుకు సహకరించాలని భార్యను కోరాడు. దీంతో ప్రియురాలితో పాటు భార్యాభర్తలిద్దరూ కలిసి కుమారుడి డెడ్ బాడీని తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.
ఇలా వెలుగులోకి..
పిల్లాడు కనిపించడం లేదు.. ఎక్కడికి వెళ్లాడు.. ఏమైంది? అని ఆ భార్యాభర్తలను కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నించారు. వారికి ఏం చెప్పాలో తెలియడం లేదు. దీంతో ఆగస్టు 26న పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు ఈ ఏడాది ఫిబ్రవరి 7న అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు సునీల్ కుమార్. ఆరు నెలల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశారు. బిడ్డ అదృశ్యమైతే మరుసటి రోజే ఫిర్యాదు చేయాలి. ఎందుకు ఆలస్యమైంది? అనే కోణంలో పోలీసులు విచారించారు. విచారణలో సునీల్ వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో మొత్తానికి కుమారుడిని తానే చంపానని, ఖననం చేసేందుకు తన భార్య, ప్రియురాలి సహకారం తీసుకున్నానని సునీల్ అంగీకరించాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

