దారుణం : గుత్తేదారుడి నిర్లక్షానికి ఇద్దరు కూలీలు బలి
క్రైం న్యూస్ | గుత్తే దారుడి నిర్లక్షానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండగా ఆకస్మత్తుగా మట్టి దిబ్బలు కూలీ ఇద్దరు దినసరి కూలీలు అక్కడిక్కడే మృతి చెందిన విషాదన ఘటన సోమవారం షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి : గుత్తే దారుడి నిర్లక్షానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండగా ఆకస్మత్తుగా మట్టి దిబ్బలు కూలీ ఇద్దరు దినసరి కూలీలు అక్కడిక్కడే మృతి చెందిన విషాదన ఘటన సోమవారం షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది.
స్ధానికులు, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం ఉప్పరిగడ్డ తాండకు చెందిన శ్రీను (38), కృష్ణయ్య (37)లతో పాటు మరో వ్యక్తి దినసరి కూలీలుగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో భాగంగానే షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 4వ వార్డు చటాన్‌పల్లి, రాంనరగ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను చేసేందుకు ముగ్గురు కూలీలు వచ్చారు.
లోతుగా తొవ్విన కాలువలోకి దిగి సిమెంట్ పైపులను బిగిస్తుండగా అకస్మత్తుగా మట్టి దిబ్బలు కూలి ముగ్గరు కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో శ్రీను, కృష్ణయ్యలు అక్కడిక్కడే మృతిచెందగా మరో కూలీ క్షేమంగా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు.
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండ సంబంధిత గుత్తెదారుడు కూలీలో పనిచేయించాడని, గుత్తెదారుడి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగి కూలీలు ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇది ఇలా ఉంటే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని యువజ సంఘాల సభ్యులు, పలు పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. మృతదేహాలను తరలించకుండా అడ్డుకున్నారు. ఒక్కొ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలని డిమాండ్ చేశారు.
సంబంధిత గుత్తే దారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా షాద్‌నగర్ పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. మృతదేహాలను షాద్‌నగర్ సర్కారు దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

