లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన మరో మహిళ తన ప్రతాపం చూపించింది. ఒక సెక్యూరిటీ గార్డు చెంపపై పలుమార్లు ఆమె కొట్టింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శనివారం పోష్ ఏరియా అయిన నోయిడా సెక్టార్ 121లోని క్లియో కంట్రీ గేట్ వద్దకు ప్రొఫెసర్ అయిన ఒక మహిళ వచ్చింది. అక్కడి సెక్యూరిటీ గార్డుతో ఆమె వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగక అతడి చెంపపై పలుసార్లు కొట్టింది. దీంతో అక్కడ ఉన్న మిగతా సెక్యూరిటీ సిబ్బంది ఏం చేయాలో తెలియక చూస్తూ ఉండిపోయారు. ఒక సెక్యూరిటీ గార్డు తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశాడు.
కాగా, అక్కడ ఉన్న సీసీటీవీలో ఈ సంఘటన రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల నోయిడాలోని జేపీ గ్రూప్ సొసైటీ వద్ద ఒక ఉన్నతస్థాయి మహిళ, సెక్యూరిటీ గార్డును కొట్టింటి. అతడి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. నాడు కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
नोएडा में एक और महिला ने सिक्योरिटी गार्डस के साथ बदसलूकी की। मामूली कहासुनी के बाद गार्ड को मारे थप्पड़। पेशे से प्रोफेसर है महिला।Cleo County सोसायटी का मामला
@himanshu_kanpur @noidapolice @anupam_News18 pic.twitter.com/s1UvYjPT8I— Prasoon Tayal (@PrasoonTayal) September 11, 2022