షాకింగ్ : మానసిక వికలాంగురాలిపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడి

రాంచీ : జార్ఖండ్‌లో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ధన్‌బాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో మానసిక వికలాంగురాలిపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. యువతిపై దారుణానికి పాల్పడటంలో అంబులెన్స్ డ్రైవర్‌కు టీస్టాల్ యజమాని సహకరించినట్టు వెల్లడైంది. మూగ, మానసిక వైకల్యంతో బాధపడుతన్న యువతిని జూన్ 26న కొందరు దవాఖానలో చేర్పించారు.
యువతిపై కన్నేసిన అంబులెన్స్ డ్రైవర్ సంజయ్ దాస్, టీస్టాల్ యజమాని కిషన్‌లు ఆదివారం రాత్రి దవాఖానలోని మహిళల వార్డులోకి ప్రవేశించి బాదితురాలిని నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. ఆపై అంబులెన్స్ డ్రైవర్ సంజయ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దవాఖాన సిబ్బంది ఈ విషయం పసిగట్టి మహిళను కాపాడేందుకు ఘటనా ప్రాంతానికి వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడికి సహకరించిన టీస్టాల్ యజమానిని వారు నిర్బంధించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చిన దవాఖాన సూపరింటెండెంట్ ఈ ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిందితుడు సంజయ్‌కు సహకరించిన టీస్టాల్ యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

