హైదరాబాద్‌లో మరో ఘోరం.. ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి..వీడియో
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నారని మొన్న సరూర్‌నగర్‌లో, నిన్న బేగంబజార్‌లో ఇద్దరు యువకులను హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చూసింది. తనను ప్రేమించట్లేదని అక్కసుతో పట్టపగలే, నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
కంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని ఓ యువతిని హబీబ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. తనను ప్రేమించాలని గత కొంతకాలం నుంచి ఆమెను వేధిస్తున్నాడు. హబీబ్ ప్రేమను ఆమె తిరస్కరిస్తూనే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం కంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని ఒమర్ హోటల్ వద్ద యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె వెనుకాలే వచ్చిన హబీబ్.. యువతిని కిందకు నెట్టేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మెడ, వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనాస్థలిలో క్లూస్ టీం వివరాలను సేకరిస్తోంది.
హైదరాబాద్ కంచన్‌బాగ్ పీఎస్ పరిధిలో మహిళపై యువకుడు కత్తితో దాడి.. pic.twitter.com/OTEOLNmNlT
— Namasthe Telangana (@ntdailyonline) May 27, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

