రోడ్డు ప్రమాదంలో 22 మంది దుర్మరణం.. 33 మందికి గాయాలు
కైరో : ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది. మిన్యా ప్రావిన్స్‌లోని మలావి నగరంలో బస్సును ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కన ట్రక్కుకు సంబంధించిన టైర్లు మారుస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈజిప్ట్‌లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉండడం, ట్రాఫిక్ చట్టాలను సరిగా అమలు చేయపోకవడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా. మరో 18 మంది గాయపడ్డారు. గతేడాది ఏప్రిల్ హైవేపై లారీని ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

