నల్లగొండ : జిల్లా పరిధిలోని అన్నెపర్తిలో విషాదం నెలకొంది. ఓ ఇంటి ప్రహరీ గోడ శుక్రవారం రాత్రి కుప్పకూలిపోయింది. దీంతో గొర్రెల గుంపుపై గోడ పడిపోయింది. 10 గొర్రెలు మృతి చెందాయి. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రహరీ గోడ మెత్తబడి కూలిపోయింది. ఒకేసారి 10 గొర్రెలు మృతి చెందడంతో యజమాని సైదులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. రూ. లక్షన్నర ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి సైదులు విజ్ఞప్తి చేశాడు.