కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి

కూరలు వండుతున్నప్పుడు ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ అవుతుంటాయి. టైం అయిపోతుందనే కంగారులోనో.. ఏదో పరధ్యానంలోనో ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ వేస్తుంటాం. కూరలో ఉప్పు తక్కువ అయితే వేసుకోగలం. అదే ఎక్కువైతే కూర టేస్ట్ మొత్తం పోతుంది. ఇక ఆ కర్రీని తినలేం. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూరలో ఎక్కువైన కారం, ఉప్పును తగ్గించేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి
ఆలుగడ్డలు
ఒక ఆలుగడ్డను నాలుగు ముక్కలుగా చేసి వాటిని కూరలో వేయాలి. అలా పది నుంచి 15 నిమిషాల పాటు వాటిని అందులో ఉడకనివ్వాలి. ఆలుగడ్డ ముక్కలు ఉప్పుతో పాటు నీటిని కూడా పీల్చుకుంటుంది. కాబట్టి గ్రేవీ కర్రీ అయితే కూరలో కొన్ని నీళ్లు కూడా పోసుకోవడం మంచిది. తినే ముందు కూరలో నుంచి ఆలుగడ్డ ముక్కలను తీసేయొచ్చు.
కొబ్బరి పాలు కలపాలి
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొద్దిగా కొబ్బరి పాలు కలపాలి. ఇలా చేయడం ద్వారా కూరలో ఉప్పదనం తగ్గి రుచిగా తయారవుతుంది.
పాలు, పెరుగు యాడ్ చేయాలి
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొద్దిగా పాలు, పెరుగు లేదా మీగడ కలపాలి. అప్పుడు ఉప్పదనం తగ్గడమే కాకుండా కర్రీకి కొత్త రుచి వస్తుంది.
ఉల్లిగడ్డ లేదా టమాటాలు కలపడం ద్వారా
ఉల్లిగడ్డ ముక్కలను నూనెలో వేయించి కూరలో కలుపుకున్నా ఉప్పు తగ్గుతుంది. కూరలో కొన్ని టమాటా ముక్కలను కూడా వేయొచ్చు.
నిమ్మరసంతో
అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపినా ఎక్కువైన ఉప్పును సరిచేస్తుంది.
నీటిని కలపడం ద్వారా
ఒకవేళ కూరలో తక్కువ నీళ్లు ఉంటే.. మరికొన్ని నీళ్లను వేసి కూరను బాగా ఉడికించాలి.
పిండిని కలపడం ద్వారా
గోధుమ పిండికి కొంచెం నీళ్లను కలిపి ఉండలుగా చేసుకోవాలి. వాటిని కూరలో వేయడం ద్వారా కూరలో ఎక్కువైన ఉప్పును పిండి గ్రహించేస్తుంది. ఆ తర్వాత వాటిని తీసేయొచ్చు.
చక్కెర
కూరలో కొంచెం చక్కెర కలిపినా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది.

కారం ఎక్కువైతే ఏం చేయాలి
టమాటాలు యాడ్ చేయడం ద్వారా
కూరలో కారం ఎక్కువైతే కొన్ని టమాటా ముక్కలను వేసి తక్కువ మంట మీద ఉడికించాలి
చక్కెర లేదా వెనిగర్
కొంచెం చక్కెర లేదా వెనిగర్ కలిపినా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అలా అని ఎక్కువ చక్కెర కలిపితే కూర తియ్యగా మారే అవకాశం ఉంది కాబట్టి చూసుకుని కలపాలి.
నిమ్మరసం
చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ కూరలు అయితే నిమ్మరసం పిండొచ్చు.
నీటిని యాడ్ చేయడం
కూరలో కొన్ని నీటిని యాడ్ చేయడం ద్వారా కూడా కారం తగ్గించొచ్చు.
కొబ్బరి పాలు
కూరలో కొబ్బరి పాలు కలడం ద్వారా కూడా ఎక్కువైన కారాన్ని తగ్గించవచ్చు.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- Food
- Health
- health tips
- ఆరోగ్యం
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

