సోయా చంక్స్ మంచూరియా
సోయా నగెట్స్ను కాస్త ఉప్పు వేసి, వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడకపెట్టి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నిటిని బాగా సన్నగా తరిగి విడివిడిగా ఉంచుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
సోయా నగెట్స్: ఒక కప్పు
వెల్లుల్లిపాయలు: పది పన్నెండు
పచ్చిమిరపకాయలు: మూడు
కార్న్ ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్
సోయాసాస్: ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర: రెండు రెబ్బలు
మిరియాలపొడి: అర టీ స్పూన్
కారం: అర టీ స్పూన్, ఉల్లికాడలు: మూడు
ఉప్పు: తగినంత, నూనె: టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం
సోయా నగెట్స్ను కాస్త ఉప్పు వేసి, వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడకపెట్టి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నిటిని బాగా సన్నగా తరిగి విడివిడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లిపాయ తరుగును వేసి వేయించాలి. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వేగాక సోయా నగెట్స్ ను నీరు పోయేలా గట్టిగా పిండి బాణట్లో వేయాలి.
అందులో మిరియాల పొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని కార్నఫ్లోర్ని వేసి పల్చగా కలుపుకోవాలి. అందులో సోయాసాస్ కలిపి బాణట్లో తిప్పుతూ పోయాలి. దీనివల్ల సోయా మంచూరియా కొంచెం జ్యూసీగా వస్తుంది. చివర్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఉల్లికాడలు చల్లుకుంటే రుచికరమైన సోయా మంచూరియాని ఆరగించవచ్చు. దీనికి హాకా నూడుల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ మంచి కాంబినేషన్.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

