కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు (పెద్దవి), చీజ్ తురుము: ఒక కప్పు, బియ్యపుపిండి: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఆలుగడ్డలను ఉడికించి తొక్కతీసి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ ముద్ద, చీజ్ తురుము, బియ్యపుపిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని ముద్దగా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి.. ఆలుగడ్డ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేత్తో పొడవుగా చేస్తూ కాగిన నూనెలో వేసి దోరగా వేయిస్తే నోరూరించే పొటాటో ఫింగర్స్ సిద్ధం. ఇవి టమాట కెచప్‌తో బాగుంటాయి.