మిల్క్‌బ్రెడ్ ముక్కలు: నాలుగు, పాలు: లీటరు, చక్కెర: ఒక కప్పు, కుంకుమ పువ్వు: చిటికెడు, రోజ్‌వాటర్: అర టీస్పూన్, యాలకుల పొడి: అర టీస్పూన్, ఫుడ్ కలర్(ఎల్లో):
చిటికెడు, పిస్తా తరుగు: ఒక టేబుల్ స్పూన్.
బ్రెడ్ ముక్కలను బిస్కెట్ కట్టర్‌తో గుండ్రంగా కత్తిరించాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి పాలు పోసి చక్కెర, కుంకుమ పువ్వు వేసి.. పావులీటర్ అయ్యేవరకూ మరిగించాలి. పాలు బాగా చిక్కబడ్డాక యాలకుల పొడి, ఫుడ్ కలర్, రోజ్ వాటర్ వేసి దింపేయాలి. బ్రెడ్ ముక్కలను చల్లని నీటిలో వేసి వెంటనే నీళ్లు లేకుండా ఒత్తి, చల్లారిన పాల మిశ్రమంలో వేసి గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన రస్మలై మీద పిస్తా తరుగు వేసి సర్వ్ చేసుకుంటే.. చల్లచల్లటి బ్రెడ్ రస్మలై సిద్ధం.
Aloo Kurkure Recipe | ఆలూ కుర్కురే తయారీ విధానం
Rooh Afza | 105 ఏండ్ల క్రితం తయారు చేసిన ఈ పానీయం స్పెషాలిటీ ఏంటో తెలుసా
Egg Karam Dosa Recipe | ఎగ్ కారం దోసె తయారీ విధానం
Vankaya Bajji Recipe | వంకాయ బజ్జీ తయారీ విధానం