కావలసిన పదార్థాలు
గుడ్లు: నాలుగు, తురిమిన చీజ్: ఒక కప్పు, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, క్యారెట్: ఒకటి, ఆలుగడ్డ: ఒకటి, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: అర టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా.
తయారీ విధానం
స్టవ్‌మీద పాన్ పెట్టి రెండు టీస్పూన్ల నూనెవేసి వేడయ్యాక తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాట, క్యాప్సికమ్, క్యారెట్, ఆలుగడ్డ ఉప్పు, పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి ఒక నిమిషంపాటు వేయించి దింపేయాలి. ఒక గిన్నెలో గుడ్లు వేసి ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి చీజ్, వేయించిన కూరగాయల ముక్కలు వేసి బాగా కలపాలి. మఫిన్స్ మౌల్డ్స్కి నూనెరాసి గుడ్డు మిశ్రమంవేసి పైనుంచి చీజ్, కొత్తిమీర చల్లి ఓవెన్లో 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు ఉడికిస్తే వేడివేడి ఎగ్ మఫిన్స్ సిద్ధం.