కొద్దిగా పండిన దొండకాయలు: పావుకిలో
చిన్న మామిడికాయ: ఒకటి
ఆవాలు: టీ స్పూన్
మినప్పప్పు: టీ స్పూన్
మెంతులు: అర స్పూను
పచ్చి శనగపప్పు: టీ స్పూన్
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
పసుపు: పావు స్పూను
ఇంగువ: కొద్దిగా
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఎండుమిరపకాయలు: నాలుగు
ఉప్పు: రుచికి తగినంత
ముందుగా మామిడికాయలు చెక్కు తీసి సన్నగా తురిమి పక్కకు పెట్టుకోవాలి. దొండకాయలను చిన్న ముక్కలుగా తరిగి బాణట్లో కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. వాటిని మిక్సీలో కచ్చాపచ్చాగా పట్టుకొని అందులో మామిడి తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూకుట్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఎండు మిరపకాయలు వేసి బాగా వేగాక కొద్దిగా ఇంగువ కూడా జోడించాలి. మంచి సువాసన వచ్చేదాకా ఆగాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో కచ్చాపచ్చాగా పట్టుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న దొండకాయ మామిడికాయ మిశ్రమంలో కలుపుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసి చివర్లో కొత్తిమీర చల్లుకుంటే విభిన్నమైన రుచితో దొండకాయ మామిడికాయ పచ్చడి సిద్ధమైపోతుంది.