బుఖారీ పులావ్
బాస్మతి బియ్యం: అర కిలో, మటన్: అర కిలో, క్యారెట్ తురుము: ఒక కప్పు, పచ్చి బఠాణీ: అర కప్పు, టమాట ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, జీడిపప్పు: పావుకప్పు, కిస్మిస్: ఒక టేబుల్ స్పూన్, అక్రోట్స్: ఐదు, నూనె: అర కప్పు, కారం: ఒక టేబుల్ స్పూన్,
- కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం : అర కిలో, మటన్: అర కిలో, క్యారెట్ తురుము: ఒక కప్పు, పచ్చి బఠాణీ: అర కప్పు, టమాట ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, జీడిపప్పు: పావుకప్పు, కిస్మిస్: ఒక టేబుల్ స్పూన్, అక్రోట్స్: ఐదు, నూనె: అర కప్పు, కారం: ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, పసుపు: ఒక టీస్పూన్, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క: రెండంగుళాల ముక్క, సాజీర: అర టీస్పూన్, యాలకులు: నాలుగు, లవంగాలు: ఆరు, అనాస పువ్వు: ఒకటి, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంటపాటు నానబెట్టుకుని పొడిపొడిగా వండాలి. స్టవ్మీద కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, అక్రోట్స్, కిస్మిస్ జోడించి బాగా వేయించి పక్కన పెట్టాలి. అదే నెయ్యిలో నూనె వేసి దాల్చిన చెక్క, సాజీర, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు వేయాలి. కాసేపు వేగాక తరిగిన ఉల్లిగడ్డ, మిర్చి, టమాట కలపాలి. అన్నీ బాగా వేగాక మటన్ వేయాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, క్యారెట్ తురుము, పచ్చిబఠాణీ, తగినంత ఉప్పు వేసి పది నిమిషాలు సన్నటి మంటపై మగ్గనివ్వాలి. అర లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. బాగా ఉడికిన మటన్లో.. ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలిపి పైనుంచి వేయించిన డ్రైఫ్రూట్స్, నెయ్యి వేసి మరో రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే నోరూరించే బుఖారీ పులావ్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

