మిల్క్ బ్రెడ్: నాలుగుస్లైసులు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: చిటికెడు, చక్కెర: అరకప్పు, కాజు, కిస్మిస్: ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, పాలు: పావు కప్పు
బ్రెడ్‌స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నెయ్యివేసి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే పాన్‌లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో మిగిలిన నెయ్యిలోనే ఒక కప్పు నీళ్ళు, చక్కెర వేసి బాగా మరిగించి వేయించిన బ్రెడ్ ముక్కల్ని వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా పాలు, యాలకులపొడి, వేయించిన కాజు, కిస్మిస్ వేసి రెండు నిమిషాలు ఉడికించి దించితే సరి నోరూరించే బ్రెడ్ హల్వా సిద్ధం.
Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం”
RRR | ట్రిపుల్ ఆర్ కుకింగ్ గురించి తెలుసా? దీనివల్ల లాభమేంటి?”
RRR | ట్రిపుల్ ఆర్ కుకింగ్ గురించి తెలుసా? దీనివల్ల లాభమేంటి?”
Cucumber Dosa recipe | కీరా దోసె తయారీ విధానం”