ప్రముఖ సినీ నటుడు అలీ కుమార్తె ఫాతిమా (Fathima) వివాహం ఈ నెల 27న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండ్లి పత్రికలు పంచే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అలీ-జుబేదా (Zubeda Ali) దంపతులు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన అలీ దంపతులు తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కలిశారు.
చిరు నివాసానికి వెళ్లిన అలీ దంపతులు ఆయనకు తమ కూతురు పెళ్లి పత్రికను అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహానికి హజరై నూతన వధూవరులకు ఆశీస్సులు అందించాలని చిరంజీవిని కోరారు. అలీ-జుబేదా దంపతులకు ఆత్మీయ ఆహ్వానాన్ని అందించిన చిరంజీవి ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఫాతిమా ఇటీవలే డాక్టర్ కోర్సును పూర్తి చేసుకుంది. అలీకి కాబోయే అల్లుడు కూడా డాక్టరేనని సమాచారం. ఇటీవలే జరిగిన ఫాతిమా నిశ్చితార్థ వేడుకకు సాయికుమార్, బ్రహ్మానందంతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మెగాస్టార్ ని కలిసి తమ కుమార్తె పెళ్ళి శుభలేఖ అందించి ఆహ్వానించిన ఆలి దంపతులు #Chiranjeevi #Ali pic.twitter.com/VNYAt7ENDg
— BA Raju's Team (@baraju_SuperHit) November 10, 2022
Read Also :Driver Jamuna | డ్రైవర్ జమున విడుదల వాయిదా.. ఇంతకీ కారణమేంటో?