Prakashraj | ‘మా’ ఎన్నికల వెనుక వైఎస్సార్సీపీ..ఫొటో విడుదల చేసిన ప్రకాశ్‌రాజ్
ఇటీవలే మంచు విష్ణు (Manchu Vishnu) ‘మా’ అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల అధికారిని ప్రకాశ్‌రాజ్ కోరారు.

‘మా’ ఎన్నికల (Maa Elections) ప్రక్రియ ముగిసి ఇటీవలే మంచు విష్ణు (Manchu Vishnu) అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన 11 మంది ప్రకాశ్‌రాజ్ (Prakashraj) ప్యానెల్ సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల అధికారిని ప్రకాశ్‌రాజ్ కోరారు.
తాజాగా ‘మా’ ఎన్నికలపై ప్రకాశ్‌రాజ్ సంచలన ట్వీట్ పెట్టారు. ‘మా’ ఎన్నికల వెనుక వైఎస్సార్సీపీ ఉందని ట్వీట్లో పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్. మా ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు వెంట వైఎస్సార్సీపీ కార్యకర్త సాంబశివరావు ఉన్నట్టు చెప్పారు. జగ్గయ్యపేట వాసి నూకల సాంబశివరావు అలియాస్ సాంబ ఫొటోను ప్రకాశ్‌రాజ్ విడుదల చేశారు. సాంబశివరావుపై క్రిమినల్ కేసులున్నాయని, ఆయనపై ఉన్న ఎఫ్ఐఆర్ కాపీలను రిలీజ్ చేశారు ప్రకాశ్‌రాజ్. సీసీటీవీ పుటేజీ ఇస్తే మరిన్ని ఆధారాలు బయటపడతాయన్నారు.

మా ఎన్నికల సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను ప్రకాశ్‌రాజ్ కోరారు. సీసీటీవీ పుటేజీ ఇస్తే ఎన్నికలు ఎలా జరిగాయో బయటపెడతానని స్పష్టం చేశారు. విష్ణు మా సంక్షేమం కోసం పనిచేయాలని, తాము బయటి నుంచి సహకరిస్తామని ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఇప్పటికే ప్రకటించింది. రానున్న కాలంలో ప్రకాశ్‌రాజ్ ఎలాంటి విషయాలు బయటపెడతారోనని సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

