త్రిగుణ్, హెబ్బా పటేల్, ఇషాచావ్లా, వర్షిణి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘టర్నింగ్ పాయింట్’. కుహన్ నాయుడు దర్శకుడు. సురేష్ దత్తి నిర్మాత. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి లాంచ్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉందని, త్వరలోనే టీజర్‌ని కూడా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇందులోని ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుందని, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ని అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. రాశి, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గరుడవేగ అంజి, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్.