Yatra 2 | ‘తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొడుకు అనే పాయింట్ చుట్టూ ‘యాత్ర-2’ కథాంశాన్ని అల్లుకున్నాం. 2009 నుంచి 2019 వరకు వై.యస్.జగన్ మెహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అన్నారు మహి వి రాఘవ్. ఆయన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘యాత్ర-2’. శివ మేక నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ రాజకీయ నాయకుడు ప్రజల కష్టాలను తెలుసుకొని ఎలా ఎదిగాడనే అంశాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. వాటినే ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మది, సంగీతం: సంతోష్ నారాయణన్, దర్శకత్వం: మహి వి రాఘవ్.