శాండల్‌వుడ్ (Sandalwood) టాప్ హీరోల్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ యాక్టర్ యశ్ (Yash). కేజీఎఫ్ సినిమాతో ఇండియాతోపాటు వరల్డ్ వైడ్‌గా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. యశ్ సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతీ యాక్టర్‌కు కెరీర్లో ఒక్కసారైనా తమకు ఇష్టమైన యాక్టర్లతో కలిసి నటించాలని ఉంటుంది. అలాగే యశ్‌కు కూడా ఒకరితో నటించాలని ఉందట.
రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు యశ్. హిందీ (Hindi )లో ఏ యాక్టర్‌తో కలిసి పనిచేయాలని ఉందని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి వెంటనే స్పందిస్తూ..బాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు నవాజుద్దీన్ సిద్దిఖీ పేరు చెప్పాడు యశ్. తనకు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui)తో నటించాలని ఉందన్నాడు యశ్. కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత యశ్ లాంటి మాస్ హీరో నవాజుద్దీన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరిస్తే చూసేందుకు విజువల్ ఫీస్ట్‌గా ఉండటం ఖాయం.
కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత కొత్త సినిమాను ప్రకటించలేదు యశ్. ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుండి ఎలాంటి సినిమా వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. నవాజుద్దీన్ ఖాతాలో టికు వెడ్స్ షేరు, భోలే చుడియాన్తోపాటు పలు హిందీ ప్రాజెక్టులున్నాయి.