కేజీఎఫ్ సినిమాతో పాన్ఇండియా స్టార్ అయిపోయాడు కన్నడ హీరో యశ్ (Yash). రీసెంట్ గా రిలీజైన కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF 2)తో మరోసారి బాక్సాపీస్ వద్ద రికార్డుల సునామి సృష్టిస్తున్నాడు. షూటింగ్స్, ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండే యశ్‌కు సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడిపుడే కొంత రిలాక్స్ టైం దొరికినట్టుంది. తన పిల్లలతో కలిసి సరదా సమయాన్ని గడిపాడు. తన పిల్లల(Yash kids)తో కలిసి ఆట ఆడాడు.
కొడుకు డైనోసార్ అనగానే..ఐరన్ డాడ్ భయపడ్డాడు అని యశ్ అంటున్నాడు. ఇపుడు డాడీ పులి అవుతున్నాడని యశ్ పులిలా గాండ్రించగా..ఈ సూపర్ స్టార్ డాడ్ కొడుకు భయపడి లోపలికి పారిపోయాడు. యశ్ తన పిల్లలతో ఫన్ టైం స్పెండ్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత కొత్త సినిమా ఏది ప్రకటించలేదు యశ్.
కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 25 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్ల వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అత్యధిక గ్రాస్ సాధించిన మూడో భారతీయ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీఎఫ్ చాఫ్టర్ 2.
A 'Wild' start to our Wednesday! pic.twitter.com/H2DPsn00zA
— Yash (@TheNameIsYash) May 11, 2022