ప్రేమ గురించి తెలియకుండా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడంలో అర్థం లేదని అంటున్నది బాలీవుడ్ తార యామీ గౌతమ్. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్‌పై తనకు ఆసక్తి లేదని ఈ నాయిక తెలిపింది. తన కొత్త సినిమా ‘లాస్ట్’ ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఇందులో పాత్రికేయురాలి పాత్రలో యామీ కనిపించనుంది. ఈ చిత్ర ప్రచారంలో పాల్గొన్న యామీ ప్రేమికుల దినోత్సవం గురించి మాట్లాడుతూ…‘ఈ వాలెంటైన్ ఎవరో, అతనేం చేశాడో నాకు అర్థం కాదు. చాలామంది యువత ప్రేమంటే ఏంటో ఏమాత్రం తెలియకుండా రెడ్ టీషర్టులు ధరించి ఊరంతా బైక్‌లపై తిరుగుతుంటారు.
గులాబీ పూలను కనిపించిన అమ్మాయికి ఇవ్వాలని చూస్తుంటారు. ప్రేమకు ఒక్క రోజు కేటాయించడం సరైనది కాదు. మనకు కావాల్సిన జీవిత భాగస్వామి దొరికినప్పుడు ప్రతి రోజూ ప్రేమమయమే అవుతుంది’ అని చెప్పింది. ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘ఉరీ, ది సర్జికల్ స్ట్రైక్’ వంటి చిత్రాలతో ఆమె ఘన విజయాలు అందుకొంది.