Ram Charan – Shanker | కోలీవుడ్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఈ దసరాకు మొదటి పాటను విడుదల చేయనున్నారని సినిమా వర్గాల నుంచి ఇటివలే సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడీ పాట విషయంలో ఓ డైలమా నెలకొంది.
పాన్ ఇండియా లెవల్లో తెలుగు హిందీ తమిళ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పాటని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావించారు. అయితే కేవలం తెలుగు వెర్షన్‌కి సంబధించిన పాటే సిద్ధంగా వుందని, మిగతా భాషలకి సంబధించి పాట పని ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అందుకే పాటని దసరాకి విడుదల చేయాలా వద్దా అనే డైలమాలో యూనిట్ ఉందని సమాచారం.
సంగీత దర్శకుడు తమన్ మొన్నటి వరకూ భగవంత్ కేసరితో బిజీగా వున్నారు. మరోవైపు గుంటూరు కారం కోసం కూడా పని చేస్తున్నారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ పాటని అన్నీ భాషల్లో చేయడానికి తగిన సమయం కుదరలేదని వినిపిస్తోంది. అయితే చాలా పాన్ ఇండియా సినిమాల ప్రమోషనల్ కంటెంట్ మొదట ఒక భాషలో విడుదలైన తర్వాత వీలు చూసుకొని వేరే భాషల్లో వదులుతారు. విజయ్ వారసుడు రంజితమే, రజనీకాంత్ జైలర్ కావాలయ్య పాటలు తమిళంలో వైరల్ అయిన తర్వాతే తెలుగు వెర్షన్స్ వచ్చాయి. మరి ‘గేమ్ ఛేంజర్’ యూనిట్ ఆ దిశగా అలోచించి ముందు తెలుగ వెర్షన్ పాటని విడుదల చేస్తే బావుటుందని చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు.