Janhvi Kappor : జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
Janhvi Kappor : తాజాగా మణికట్టుపై వేయించుకున్న టాటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఈ టాటూలో ‘ఐ లవ్ యూ మై లబ్బూ’ అని ఉంది..,

(Janhvi Kappor) నటి జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్నది. తల్లి శ్రీదేవి నుంచి వారసత్వంగా నటనను అందుకున్న జాన్వీ కపూర్.. ఒకటిరెండు సినిమాలతోనే స్టార్‌డమ్‌ను అందుకున్నారు. శ్రీదేవి కూతురుగా కాకుండా సొంతంగా తనకంటూ ఇమేజిని సాధించుకునేందుకు చెమటోడ్చుతున్నది. అయితే, తాజాగా మణికట్టుపై వేయించుకున్న టాటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఈ టాటూలో ‘ఐ లవ్ యూ మై లబ్బూ’ అని ఉంది.
టాటూలో ఉన్న లబ్బూ ఎవరంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. లబ్బూ అనే వ్యక్తిని ప్రేమిస్తే మాత్రం అలా బాహాటంగా టాటూ వేయించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, లబ్బూ అనేది తాను ప్రేమించే వ్యక్తి కాదని చాలా మందికి తెలియదు. జాన్వీకపూర్‌కు తల్లి శ్రీదేవితో చాలా అటాచ్మెంట్ ఉండేది. జాన్వీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీదేవి ఉన్నారనేది జగమెరిగిన సత్యం. తన తల్లిని స్మరించుకుంటూ ఆమె చేతిరాతతో తనపై ఒలకబోసిన ప్రేమను టాటూ రూపంలో మణికట్టుపై వేయించుకున్నది. ఈ విషయాన్ని ఆమెనే ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకున్నారు.
జాన్వీని తల్లి శ్రీదేవి లబ్బూ అని ప్రేమగా పిలిచేది. తన తల్లి చేతిరాతతో ఉన్న వాక్యాన్ని అదేమాదిరిగా మణికట్టుపై టాటూగా వేయించుకున్నది. శ్రీదేవి మూడో వర్ధంతి సందర్భంగా తనకు తల్లి రాసిన నోట్‌ను జాన్వీ షేర్ చేసింది. దానిలో ‘లవ్ యూ మై లబ్బూ. యూ ఆర్ ది బెస్ట్ బేబీ ఇన్ ది వరల్డ్’ అని ఉన్నది.
ఇవి కూడా చదవండి..
రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం రెండో పాకిస్తాన్ అయ్యేది: ప్రభు చౌహాన్
బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనక, వరుణ్ ఔట్!
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి : వెంకయ్యనాయుడు
మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం
సంపాదనలో 10 వ వంతు దానం చేయమన్న గురు గోవింద్ సింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

