బిగ్ బాస్ 5 తెలుగు (BiggBoss Season 5 Telugu) చూస్తుండగానే చివరి దశకు వచ్చేసింది. మరో మూడు వారాల్లో సీజన్ ముగుస్తుంది. ఇంటి చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ జస్వంత్ (shanmukh jaswanth) ఎంపికయ్యాడు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి..గత కెప్టెన్ మానస్ మినహా అందరూ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. మానస్ (Manas) ఒక్కడిని పక్కన పెడితే.. కాజల్, సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ప్రియాంక సింగ్ (Priyanka Singh) నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లకు ఓటింగ్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతుంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సారి ఓటింగ్ లో అందరికంటే ఎక్కువగా సన్నీ ముందున్నాడు.
ఆయనకు దాదాపు 24 శాతం ఓట్లు పడుతున్నాయి. ఆయన తర్వాత యాంకర్ రవి 21 శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. షణ్ముఖ్ జస్వంత్, సిరి, శ్రీరామచంద్ర, కాజల్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. అందరి కంటే చివరలో ప్రియాంక సింగ్ ఉంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ లో వీక్ ఎవరు అంటే ప్రియాంక పేరు అందరికంటే ముందు వినిపిస్తుంది. గేమ్ పరంగా కూడా ఈమె ఎక్కువగా తన స్నేహితులపై ఆధారపడుతుందని విమర్శలు ఉన్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా మానస్ చుట్టూ ఈమె గేమ్ తిరుగుతోంది. దాంతో ఓటింగ్‌లో ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ వారం ఎలా చూసుకున్నా కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ప్రియాంక సింగ్ కు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి గత వారం అనీ మాస్టర్ (Anee master) కంటే ప్రియాంకకు ఓట్లు తక్కువగా పడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కావాలని ఆమె సేవ్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో 12వ వారం ఖచ్చితంగా పింకీ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయమైపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
ఇది కూడా చూడండి
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!