సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యువ హీరో ఆదిసాయికుమార్ (Aadi Saikumar). ఈ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి టాప్ గేర్ (Top Gear). కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు.రియా సుమన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తెలుగులో నవలా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న తొలి సినిమా టాప్ గేర్. ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
టాప్‌గేర్ డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేవిడ్ ఎవరు..? డిసెంబర్ 30న గుర్తించండి.. అని మేకర్స్ అప్డేట్ అందించారు. టాప్ గేర్ ఫస్ట్ సింగిల్ వెన్నెల వెన్నెల పాటను మ్యూజిక్ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తు్న్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న టాప్‌గేర్ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి, గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు ఆది సాయికుమార్. జంగిల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ.. చాఫ్టర్ 1, సీఎస్ఐ సనాతన్ చిత్రాలు ఆది ఖాతాలో ఉన్నాయి. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
ఇంతకీ డేవిడ్ ఎవరు..?
Who's David? Find out on December 30th in theatres.
Trailer►https://t.co/4bIdnUwgak #TopGearOnDec30th @iamaadisaikumar @IRiyaSuman #Shashikanth #SriDhanaLakshmiProductions #KVSridharReddy @rameemusic #GiridharMamdipally #SaiSreeram @adityamusic @PROSaiSatish pic.twitter.com/YgMYOUQG0G
— BA Raju's Team (@baraju_SuperHit) December 21, 2022
టాప్ గేర్ ట్రైలర్..
Read Also :Bedurulanka 2012 | సస్పెన్స్‌గా కార్తికేయ బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో