Sai Pallavi | నేను ఎక్కడికెళ్లినా శాఖాహారినే.. జపాన్‌లో షూట్ టైంలో ఏం జరిగిందో చెప్పిన సాయిపల్లవి
Sai Pallavi | ప్రేమమ్, ఫిదా సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి (Sai Pallavi). తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది.
Sai Pallavi | ప్రేమమ్, ఫిదా సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి (Sai Pallavi). తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జపాన్‌లో తనకెదురైన ఓ సంఘటనను అందరితో షేర్ చేసుకుంది. చిట్‌చాట్‌లో సాయిపల్లవి మాట్లాడుతూ.. జపాన్‌లో ఒక నెలపాటు షూటింగ్ చేశా. అక్కడ శాఖాహారం దొరకలేదు. శాఖాహారంలో కూడా చికెన్ బ్రాత్ వాటర్‌తో వండారా..? అయితే నేను తినను ఫర్వాలేదన్నా.. ఎందుకంటే ఒక జంతువు చంపి తినడంలో వచ్చే ఆరోగ్యం నాకొద్దనిపిస్తుంది. అందుకే నేనెప్పటికీ శాఖాహారినే. నేనెక్కడికెళ్లినా శాఖాహారినే. ఓ జీవి చనిపోతే నేను తట్టుకోలేనంది.
ఇంకో వ్యక్తిని హర్ట్ చేయడం.. పబ్లిక్‌గా ఇబ్బంది పెట్టానంటే నాకు నేను వెళ్లి ఏం అనుకోకండి అని చెప్తా. నాకు ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. నా ఎమోషన్స్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వను. రోజూ మెడిటేషన్ చేయకపోతే కొంచెం అన్‌బ్యాలెన్స్ (అసమతుల్యం)గా ఉన్నట్టు అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది.
ఇటీవలే అమరన్‌తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also :
Satyadev | బ్రతికిపోయాం.. ముఫాసా ది లయన్ కింగ్‌లో టాకాకు సత్యదేవ్ వాయిస్
Coolie | తలైవా బర్త్ డే స్పెషల్.. కూలీ షూట్ లొకేషన్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

