Star Heroes Theatres | స్టార్ హీరోలకే థియేటర్స్ పై నమ్మకం లేకపోతే ఎలా..?
కేవలం తెలుగులోనే కాదు (Telugu Cinema) మిగిలిన ఇండస్ట్రీలో కూడా కొందరు స్టార్ హీరోల తీరు చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు విడుదలై బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ సాధించి మంచి విజయం కూడా అందుకున్నాయి.

కేవలం తెలుగులోనే కాదు (Telugu Cinema) మిగిలిన ఇండస్ట్రీలో కూడా కొందరు స్టార్ హీరోల తీరు చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. ఒకప్పుడు కరోనా వైరస్ ఉంది.. దానివల్ల థియేటర్స్ మూతపడ్డాయి..అప్పుడు సినిమాలు విడుదల చేసుకోవడానికి మరో ఆప్షన్ లేక ఓటీటీ వైపు అడుగులు వేశారు. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వైరస్ తగ్గు ముఖం పట్టింది.. కొన్ని రోజులుగా కేసులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. దానికి తోడు కొన్ని సినిమాలు విడుదలై బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ సాధించి మంచి విజయం కూడా అందుకున్నాయి.
మొన్నటికి మొన్న అక్షయ్ కుమార్ (Akshay kumar) హీరోగా నటించిన సూర్యవంశీ సినిమా ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు చేసింది. మరోవైపు రజనీకాంత్ పెద్దన్న సినిమా కూడా తెలుగు, తమిళంలో కలిసి 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అవసరం లేదు. ఇలాంటి సమయంలో కూడా కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలను నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల చేయడం డిస్ట్రిబ్యూటర్లకు ససేమీరా నచ్చడం లేదు.

తెలుగులో వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తున్న దృశ్యం 2 (Drushyam 2) సినిమా నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది. బయటకు చెప్పడం లేదు కానీ ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల కావడం చాలామంది బయ్యర్లకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం కూడా ఉంది. ఇలాంటి సమయంలో సురేష్ బాబు ఓటిటి వైపు వెళ్లడం బయ్యర్లకు రుచించడం లేదు. మరోవైపు తమిళంలో సూర్య (Suriya) తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అక్కడ థియేటర్ల సంఘానికి కోపం తెప్పిస్తున్నాయి.
మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేరళలో 100 కోట్లు వసూలు చేసిన తొలి హీరో ఆయన. అలాంటి సూపర్ స్టార్ రాబోయే తన 5 సినిమాలను ఓటీటీలో 500 కోట్లకు బేరం పెట్టాడు. ఇదంతా చూసిన తర్వాత థియేటర్స్ వ్యవస్థ ఏమై పోతుంది అనే ఆలోచన అందరిలోనూ వస్తుంది. మీకు మేమున్నామని ధైర్యం చెప్పాల్సిన స్టార్ హీరోలే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే థియేటర్స్ వ్యవస్థ నాశనం కాకపోతే ఇంకేం అవుతుంది అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సమాధానం ఎవరు చెప్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Pintop1
- star heroes
- suriya
- Theatres
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

