ఈ అనుమానం ఒక్కరికో ఇద్దరికో కాదు..చాలా మందికి వస్తుంది. ఎందుకంటే గాడ్ ఫాదర్ (Godfather) మొదటి రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత మెగాస్టార్ మార్కెట్ దారుణంగా పడిపోయిందనే విషయం అర్థమవుతుంది. అభిమానులకు ఇది ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఎందుకంటే చిరంజీవి (Chiranjeevi) సినిమా మొదటి రోజు కలెక్షన్స్ (Godfather Collections) అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.
అంత పెద్ద డిజాస్టర్ అయిన ఆచార్య సినిమాకు కూడా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 29 కోట్ల షేర్ వచ్చింది..ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్ల షేర్ 65 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాకు కేవలం 38 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. అందులో షేర్ 18 కోట్లు మాత్రమే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల షేర్ వచ్చింది. ఈ నెంబర్స్ చూసిన తర్వాత ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి సినిమాకు ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం ఎవరికీ అర్థం కావడం లేదు.
ఒకవేళ మెగాస్టార్ క్రేజ్ తగ్గిందా..? లేదంటే ఆల్రెడీ రీమేక్ సినిమా కాబట్టి ఎందుకు చూడాలి అని వదిలేసారా.? అంతు చిక్కడం లేదు. ఐదేళ్ల కింద చిరంజీవి ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల షేర్ వచ్చింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి 38 కోట్ల షేర్ వసూలు చేయగా.. ఆచార్య దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూడు సినిమాల కంటే కనీసం సగం కూడా వసూలు చేయలేకపోయింది గాడ్ ఫాదర్.
Read Also : Ahimsa Teaser | తేజ టీం క్రేజీ అప్డేట్..లవ్ ట్రాక్, యాక్షన్ పార్టుతో అహింస టీజర్
Read Also :Salman Khan | మై డియర్ చిరు..సల్మాన్ ఖాన్ వీడియో వైరల్
Read Also : Satyadev | గాడ్ ఫాదర్‌తో సత్యదేవ్..ఎమోషనల్ పోస్ట్ వైరల్