WAVES Summit 2025 | వేవ్స్ సమ్మిట్‌లో కలిసిన స్టార్ హీరోలు.. చాలా రోజుల తర్వాత ఇలా
WAVES Summit 2025 | నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ జరగనుండగా, ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది.
WAVES Summit 2025 | నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ జరగనుండగా, ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఇది మీడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం కాగా, ఆ కార్యక్రమానికి మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించగా, కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ వివరించారు. గత వందేళ్లలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకి కూడా చేరుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్‌లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ , రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ తారలు పాల్గొన్నారు.
అయితే రజనీకాంత్, మోహన్ లాల్, హేమ మాలిని, చిరంజీవి, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్ కలిసి ఓ గ్రూప్ ఫొటో దిగారు. ఈ పిక్ ఎంతగానో ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఆ నాటి సీనియర్ హీరోలు అందరు కలిసి ఇలా ఫొటో దిగగా, ఇప్పుడు ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. అలనాటి స్టార్స్ ఇలా ఒకే గ్రూప్ పిక్‌లో చూడడం చాలా ఆనందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బుధవారమే చిరంజీవి ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి ముంబయి చేరుకున్నారు. ఆయనకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వేవ్స్ సమ్మిట్‌కి చిరు చాలా సింపుల్‌గానే వెళ్లారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

