Priyanka Chopra | ఇక్కడి రాజకీయాలతో విసుగుచెందా.. బీటౌన్‌ను వీడటంపై తొలిసారి నోరువిప్పిన ప్రియాంక
Priyanka Chopra | గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో (Bollywood) స్టార్ నటుల్లో ఒకరైన ప్రియాంక.. ప్రస్తుతం హాలీవుడ్ (Hollywood)లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ను కాదని హాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల గురించి మొదటిసారి నోరు విప్పింది.
Priyanka Chopra | గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో (Bollywood) స్టార్ నటుల్లో ఒకరైన ప్రియాంక.. ప్రస్తుతం హాలీవుడ్ (Hollywood)లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ను కాదని హాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల గురించి మొదటిసారి నోరు విప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హాలీవుడ్లో అవకాశాలు వెతుక్కోవడానికి గల కారణాలను వెల్లడించింది. బాలీవుడ్ సినీపరిశ్రమలో వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా లేనని చెప్పింది. పరిశ్రమలోని రాజకీయాలతో (Politics) విసుగుచెందానంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
‘నన్ను బాలీవుడ్ (Bollywood) పరిశ్రమలో ఒక మూలకు నెట్టేశారు. కొందరు నాకు అవకాశాలు కూడా రాకుండా చేశారు. కొందరితో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ ఆటలు ఆడేందుకు నాకంత నైపుణ్యం లేదు. అక్కడి రాజకీయాలకు విసిగిపోయాను. దీంతో బ్రేక్ కోరుకున్నాను. ఆ సమయంలోనే హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అలా బాలీవుడ్‌ను వీడాల్సి వచ్చింది’ అంటూ ఓ పోడ్ కాస్ట్ ( podcast ) కోసం డాక్స్ షెఫర్డ్ (Dax Shepard)తో ప్రియాంక ఈ విషయాలను పంచుకుంది.
ఇదే సందర్భంలో హాలీవుడ్ నుంచి ఆఫర్ ఎలా వచ్చిందో కూడా ప్రియాంక వివరించింది. ‘దేశీ హిట్స్’ (Desi Hits) కు చెందిన అంజులా ఆచారియా (Anjula Acharia) తనను ఓ మ్యూజిక్ వీడియోలో చూసి ఫోన్ చేసినట్లు తెలిపింది. అప్పుడు తాను ‘సాత్ ఖూన్ మాఫ్’ (Saat Khoon Maaf) సినిమా చిత్రీకరణలో ఉన్నట్లు చెప్పింది. అమెరికాలో మ్యూజిక్ కెరీర్ పట్ల ఆసక్తిగా ఉన్నారా? అని అడిగినట్టు వివరించింది. అదే సమయంలో బాలీవుడ్ వెలుపల అవకాశాల కోసం తాను చూస్తున్నట్టు ప్రియాంకా పేర్కొంది. బీటౌన్నుంచి బయటపడేందుకు ఇదే మంచి సమయం అనిపించిందని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు వెల్లడించింది. అలా బీటౌన్‌ను వీడాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.
ప్రియాంక తదుపరి హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’ (Citadel)తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇది ఏప్రిల్ 28న ప్రైమ్ వీడియోస్‌లో అందుబాటులోకి రానుంది. మే 26 వరకు వారానికి ఓ కొత్త ఎపిసోడ్ రూపంలో ప్రేక్షకులను అలరించనుంది.
కాగా, ప్రియాంక చోప్రా 2012లో ‘ఇన్ మై సిటీ’ (In My City) తో హాలీవుడ్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ పాట హిట్టవ్వడంతో ప్రియాంకకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. 2013లో అమెరికన్ రాపర్ పిట్బుల్తో కలిసి ‘ఎక్సోటిక్’, 2014లో ‘ఐకాంట్ మేక్ యు లవ్ మి’ అనే పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రియాంక హాలీవుడ్‌కు వెళ్లి కేవలం మ్యూజిక్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. 2015లో వచ్చిన హాలీవుడ్ టీవీ సిరీస్ (American Broadcasting Company-ABC) క్వాంటికోతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిని టీవీ షోగా రికార్డు సృష్టించింది. అందులో లీడ్ రోల్ పోషించిన ప్రియాంక నటనకు ప్రత్యేకంగా ప్రశంసలు వర్షం కురిసింది. తర్వాత హాలీవుడ్లో పలు చిత్రాలు, సిరీస్‌తో బిజీబిజీగా గడుపుతోంది.
Also Read..
Rahul Gandhi | ఆ నోటీసులకు కట్టుబడి ఉంటా.. బంగ్లాను ఖాళీ చేస్తా : రాహుల్ గాంధీ
Bus accident in Saudi Arabia | ఘోర ప్రమాదం.. వంతెనను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు.. 20 మంది మృతి
Bellamkonda Srinivas | చరిత్ర సృష్టించిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఆ సినిమాతో ప్రపంచ రికార్డు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

