David Warner | చాలా ఏళ్ల తర్వాత నితిన్ రాబిన్ హుడ్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. అయితే గతంలో వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ పెద్ద హిట్ కొట్టగా, మళ్లీ వారిద్దరి కాంబోలో వచ్చిన రాబిన్ హుడ్ చిత్రం కూడా పర్వాలేదనిపించింది. అయితే సినిమాలో డేవిడ్ వార్నర్ కనిపిస్తాడని ముందే ప్రకటించడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా డేవిడ్ వార్నర్ చురుగ్గా పాల్గొని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అయితే సినిమాలో డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వచ్చి ఓ రెండు నిముషాలు నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఇది కేవలం ఆ పాత్ర ఇంట్రడక్షన్ లా ఉంటుంది. అయితే కొద్ది సేపు మాత్రమే ఆయన కనిపించే సరికి ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. కాని సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని చివరలో ప్రకటించారు. ఆ సీక్వెల్ కి ‘బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్’ అనే టైటిల్ కూడా ప్రకటించడం గమనార్హం. ఆ సీక్వెల్ లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ అని క్లైమాక్స్ లో హింట్ కూడా ఇచ్చారు. రాబిన్ హుడ్లో నితిన్, వార్నర్ మధ్య ఫేస్ టూ ఫేస్ సీన్ ఒక్కటి లేదు. కాని సీక్వెల్లో మాత్రం ఇద్దరి మధ్య రసవత్తర పోటీ ఉంటుందని అర్ధమవుతుంది.
ప్రస్తుతానికి రాబిన్ హుడ్ సినిమా రిజల్ట్ యావరేజ్ అని కొందరి నోట వినిపిస్తుండగా, మరి సీక్వెల్ తీసే ప్రయత్నం చేస్తారా? అందులో డేవిడ్ వార్నర్ ని విలన్ గా చూపిస్తారా అనేది చూడాలి. కాగా, ఈ చిత్రంలో నితిన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. నటనతోను ఆకట్టుకున్నాడు. శ్రీలీల కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. వెన్నెల కిశోర్ పాత్ర కొంతవరకూ ఫరవాలేదు. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం అక్కడక్కడా పొంతన లేకుండా ఉంది. సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, కోన్ని సీన్స్ ట్రిమ్ చేయవలసి ఉంది.