రణ్భీర్కపూర్తో నటించాలనుంది!

బాలీవుడ్ అరంగేట్రం ఆలస్యం కావడానికి తనలో ఉన్న భయమే ప్రధాన కారణమని చెప్పింది సమంత. తెలుగు చిత్రసీమలో అగ్రనాయికల్లో ఒకరిగా చెలామణి అవుతోన్న ఆమె ‘ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్‌సిరీస్‌తో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజీ అనే తమిళ రెబెల్‌గా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో సమంత నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్లో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా తన హిందీ అరంగేట్రం గురించి సమంత మాట్లాడుతూ ‘బాలీవుడ్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన నటీనటులున్నారు. వారితో పోటీపడి రాణించగలనా?లేదా? అనే భయాలు నాలో ఉండేవి. అందుకే గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినా తిరస్కరించాను. వెబ్‌సిరీస్‌లో దర్శకద్వయం రాజ్ డీకే నా పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అది నచ్చే నటించడానికి అంగీకరించా. ట్రైలర్‌కు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే విడుదలకు ముందే నా పాత్ర విజయవంతమైందనే అనుభూతి కలుగుతోంది’ అని చెప్పింది. అలాగే ఈ సిరీస్‌లో మనోజ్‌బాజ్‌పాయ్ పోషించిన పాత్రను తెలుగులో ఎవరూ చేస్తే బాగుంటుందని సమంతను అడిగితే.. మామయ్య నాగార్జున అంటూ టక్కున సమాధానమిచ్చింది. హిందీలో రణ్భీర్కపూర్తో రొమాంటిక్ సినిమా చేయాలన్నది తన కల అని వెల్లడించింది. ‘ఫ్యామిలీమాన్-2’ వెబ్‌సిరీస్ జూన్ 4న విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

