Waltair Veerayya Movie Trailer | మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ స్టైల్ సినిమాలో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ అలాంటిదే. చిరుకు మెగా ఫ్యాన్ అయిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాబీ గత సినిమాలు పెద్దగా హిట్లు సాధించకపోయిన.. ఈ సినిమాపై మెగా అభిమానులు మంచి నమ్మకంతో ఉన్నారు. పైగా ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, పాటలు బాస్ వింటేజ్ సినిమాలు గుర్తుచేస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లు మొదలు పెట్టే ఆలోచనలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం ట్రైలర్ కట్లో బిజీగా ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఈ సినిమాలోని వాల్తేరు సాంగ్ మరికొద్ది సేపట్లో రిలీజ్ కానుంది.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన రవితేజ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. చిరంజీవి యూనియన్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.